Telugu Global
Cinema & Entertainment

Agent Movie - ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే!

Agent Movie - అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది.

Agent Movie - ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే!
X

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

మేకర్స్ తాజాగా మొదటి సింగిల్ విడుదల చేశారు. ఈ పాటను అక్కినేని ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మొదటిసారిగా, అఖిల్ ట్విట్టర్ స్పేస్‌లలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. పాటను యూనిక్ స్టయిల్ లో లాంచ్ చేశారు.

ఈ పాట ఇప్పటికే ప్రోమో వెర్షన్‌ తో ప్రజాదరణ పొందింది. పూర్తి వెర్షన్ విన్నర్ గా నిలిచింది. మైల్డ్ బాస్ వర్క్ పాట కు హైలైట్. హిప్-హాప్ తమిళ, వినగానే ఆకట్టుకునే నెంబర్ ని కంపోజ్ చేశారు. పాటలో వినిపించిన ఇంగ్లీష్ ర్యాప్‌ మరింత ఇంపాక్ట్ ని ఇచ్చింది.

అఖిల్ ఈ పాటలో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించాడు. లవ్లీ ఎక్స్ ప్రెషన్స్, ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నాడు. సాక్షి వైద్య అందంగా కనిపించింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మనల్ని కట్టిపడేస్తుంది. బ్యూటీఫుల్ ఫారిన్ లొకేషన్స్ లో రూపొందించిన పాటలోని విజువల్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి.

ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతుంది ఏజెంట్.



First Published:  23 Feb 2023 3:50 AM GMT
Next Story