Telugu Global
Cinema & Entertainment

Akhil Akkineni - కిరణ్ అబ్బవరం కోసం అఖిల్

Akkineni Akhil Kiran Abbavaram - కిరణ్ అబ్బవరం సినిమా ఫంక్షన్ కు అక్కినేని అఖిల్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. ఈ కనెక్షన్ ఎలా కుదిరింది?

Akhil Akkineni - కిరణ్ అబ్బవరం కోసం అఖిల్
X

కిరణ్ అబ్బవరం తాజా చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కింది ఈ సినిమా. ప్రమోషన్లతో ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ప్రతి ప్రచారా కార్యక్రమాన్ని డిఫరెంట్ గా చేస్తోంది యూనిట్. ఎట్టకేలకు కీలకమైన ప్రచార పర్వంలోకి ఎంటరయ్యారు. అదే ప్రీ రిలీజ్ ఫంక్షన్.

18వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా అక్కినేని అఖిల్ హాజరుకాబోతున్నాడు. నిజానికి గీతా ఆర్ట్స్ ఫంక్షన్ అంటే మెగా హీరోలుంటారు. కానీ ఈసారి కాస్త వెరైటీగా ఉంటుందనే ఉద్దేశంతో, అఖిల్ ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని అఖిల్ వెంటనే మన్నించాడు.

గీతాఆర్ట్స్, అఖిల్ కు మధ్య చిన్న అనుబంధం ఉంది. గతంలో జీఏ2 బ్యానర్ పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేశాడు అఖిల్. అప్పట్నుంచి అరవింద్-అఖిల్ కు మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ అనుబంధంతోనే కిరణ్ అబ్బవరం సినిమా ఫంక్షన్ కు వచ్చేందుకు అంగీకరించాడు అఖిల్.

First Published:  14 Feb 2023 6:00 PM GMT
Next Story