Telugu Global
Cinema & Entertainment

Agent Movie: అఖిల్ సినిమా నుంచి పెద్ద అప్ డేట్ వస్తోంది

Akhil's Agent Movie Update - అఖిల్ సినిమాపై బిగ్ అప్ డేట్ రాబోతోంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమాకు కొత్త విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Agent Movie: అఖిల్ సినిమా నుంచి పెద్ద అప్ డేట్ వస్తోంది
X

సంక్రాంతికి వస్తుందనుకున్న ఏజెంట్ సినిమా వాయిదా పడింది. అప్పట్నుంచి ఆ సినిమా విడుదల తేదీపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కొంతమంది సినిమా షూటింగ్ అవ్వలేదంటున్నారు, మరికొందరు బడ్జెట్ వల్ల సినిమా ఆగిందంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మరో 2 రోజల్లో సినిమాకు సంబంధించి కీలకమైన అప్ డేట్ ఇవ్వబోతోంది యూనిట్.

అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్, భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ సినిమా విడుదల తేదీని మరో 2 రోజుల్లో ప్రకటించబోతున్నారు. రిపబ్లిక్ డే కానుకగా, కొత్త పోస్టర్ రిలీజ్ చేసి, అందులో ఏజెంట్ రిలీజ్ డేట్ ను వెల్లడించబోతున్నారు.

ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకిదే తొలి తెలుగు సినిమా. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా కూడా ఇదే.

ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు. ఎయిట్-ప్యాక్ సాధించాడు, ఫైట్స్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాడు. యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో గూఢచారిగా కనిపించబోతున్నాడు అక్కినేని అఖిల్.

First Published:  24 Jan 2023 5:18 PM GMT
Next Story