Telugu Global
Cinema & Entertainment

Agent Movie Trailer: ఏజెంట్ ట్రయిలర్ లో అఖిల్ వైల్డ్ లుక్

Akhil's Agent Movie Trailer Review: అఖిల్ ఏజెంట్ మూవీ ట్రయిలర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం.

Agent Movie Trailer Review in Telugu
X

Agent Movie Trailer: ఏజెంట్ ట్రయిలర్ లో అఖిల్ వైల్డ్ లుక్

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కలిసి చేసిన సినిమా ‘ఏజెంట్‌’. మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి ఏజెంట్ తో వీళ్లిద్దరూ రెడీ అయ్యారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కాకినాడలో ఏజెంట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ని గ్రాండ్ గా నిర్వహించారు.

ట్రైలర్ లో ‘ఏజెంట్’ స్టోరీలైన్ గురించి పెద్దగా రివీల్ చేయకుండా క్యురియాసిటీని పెంచారు. ప్రతి పాత్ర పెర్ఫార్మెన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, బీజీఏం, ప్రొడక్షన్ వాల్యూస్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ను ట్రయిలర్ లో పరిచయం చేశారు. యాక్షన్ అంశాలను ఎక్కువగా హైలెట్ చేస్తూ ట్రయిలర్ కట్ చేశారు.

డేరింగ్, డాషింగ్‌ వైల్డ్‌గా ఉండే పవర్-ప్యాక్డ్ ఏజెంట్ పాత్రలో కనిపించాడు అఖిల్. స్క్రీన్ పై కనిపించిన ప్రతి ఎలిమెంట్ అద్భుతంగా ఉంది. అఖిల్ తన స్టంట్స్ , వైల్డ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. అతని పాత్ర ఏజెంట్ కు ఫ్రెస్ నెస్ ని తీసుకొచ్చింది.

సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ఈ సినిమాకు స్పెషల్ లుక్ తీసుకొచ్చారు. ఇందులో సాక్షి వైద్య రొమాంటిక్ ఎపిసోడ్‌ కూడా చూపించారు. రసూల్ ఎల్లోర్ ప్రతి ఫ్రేమ్‌ని చాలా స్టైలిష్‌గా తీశాడు. హిప్ హాప్ తమిళ బీజీఎం మరో పెద్ద ఎసెట్. ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉన్నాయి. 28న థియేటర్లలోకి రాబోతున్నాడు ఏజెంట్.



First Published:  19 April 2023 1:36 AM GMT
Next Story