Telugu Global
Cinema & Entertainment

Agent Movie Update: సంక్రాంతి బరిలో మరో సినిమా

Agent Movie Update: సంక్రాంతి బరిలో మరో సినిమా వచ్చి చేరింది. అఖిల్ ఏజెంట్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

Agent Movie Update: సంక్రాంతి బరిలో మరో సినిమా
X

అఖిల్ ఏజెంట్ సినిమా

'ఏజెంట్' సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ ఆల్రెడీ రిలీజై, మంచి రెస్పాన్స్ రాబట్టింది.

తాజాగా ఏజెంట్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. దీపావళి సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్ ను విడుదల చేసి, సంక్రాంతికి సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు తెలిపారు. అఖిల్ కు ఇదే తొలి సంక్రాంతి మూవీ.

రసూల్ ఎల్లోర్ ఏజెంట్ వరల్డ్ ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు. ఇక హిప్ హాప్ తమిజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై ఈ మూవీ వస్తోంది.

ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా వస్తోంది ఏజెంట్. ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

సంక్రాంతికి ఇప్పటికే ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా బరిలో దిగుతోంది ఏజెంట్.




First Published:  24 Oct 2022 11:24 AM GMT
Next Story