Telugu Global
Cinema & Entertainment

Agent Movie - అఖిల్ మూవీ నుంచి మళ్లీ అదే క్లారిటీ

Akhil Agent Movie - ఏజెంట్ మూవీ నుంచి మళ్లీ అదే క్లారిటీ. ఈసారి సినిమా కచ్చితంగా 28కి వస్తుందంటున్నారు. అఖిల్ ఇంటర్వ్యూలు కూడా స్టార్ట్ చేశాడు.

Agent Movie: జోరుగా ఏజెంట్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్
X

Agent Movie: జోరుగా ఏజెంట్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్

హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ పాన్ ఇండియా విడుదలపై ఎప్పటికప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి ఎనౌన్స్ చేశారు. ఈరోజు అఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, సినిమా 28న వస్తున్నట్టు ఇంకోసారి క్లారిటీ ఇచ్చారు.

‘ఏజెంట్‌’తో సమ్మర్ రేస్‌లో లోకి వచ్చాడు అఖిల్. లాంగ్ హాలిడేస్ సినిమాకు చాలా అడ్వాంటేజ్ కానున్నాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో భారీ పేలుడు జరుగుతున్నప్పుడు, మెషిన్ గన్ పట్టుకుని ఎగ్రెసివ్ గా నడుచుకుంటూ వస్తూ అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించాడు. ఇందులో అఖిల్ ఓ గూఢచారి.

సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నాడు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి హిపాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. ఈరోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు. అఖిల్-సుమ ఇంటర్వ్యూను రిలీజ్ చేశారు.

First Published:  8 April 2023 11:58 AM GMT
Next Story