Telugu Global
Cinema & Entertainment

Agent Movie - కోతిలా నటించానంటున్న అఖిల్

Akhil Agent movie - ఏజెంట్ మూవీలో అఖిల్ పాత్ర ఎలా ఉండబోతోంది? తన పాత్ర ఎలా ఉండబోతోందో స్వయంగా అఖిల్ బయటపెట్టాడు.

Agent Movie - కోతిలా నటించానంటున్న అఖిల్
X

అఖిల్ హీరోగా నటించిన సినిమా ఏజెంట్. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది ఈ మూవీ. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ మూవీలో గూఢచారిగా నటించాడు అఖిల్. సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు.

"ఏజెంట్ జోనర్ నాకు బాగా నచ్చేసింది. లిమిటేషన్స్ విషయానికి వస్తే.. ఇంత క్రేజీగా చేయగలుగుతానా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇంతకుముందు అలాంటిది చేయలేదు. ఈ పాత్ర కోతిలానే బిహేవ్ చేస్తుంది. ప్రతి క్షణం ఒక హైలో మాట్లాడాలి. అది నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే.. వ్యక్తిగతంగా నాకు కొంచెం సిగ్గు. అయితే కొంత జర్నీ తర్వాత ఆ పాత్ర అలవాటైపోయింది."

ఇలా ఏజెంట్ లో తన పాత్ర వైల్డ్ మంకీలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుందని చెప్పుకొచ్చాడు అఖిల్. ఇక తన బాడీ ట్రాన్సఫర్మేషన్ గురించి మాట్లాడుతూ.. ఎవ్వర్నీ ఆదర్శంగా తీసుకొని సిక్స్ ప్యాక్ సాధించలేదని, కేవలం సురేందర్ రెడ్డి చెప్పిన పాత్ర లక్షణాల్ని దృష్టిలో పెట్టుకొని వర్కవుట్ చేశానని తెలిపాడు.

28న థియేటర్లలోకి వస్తోంది ఏజెంట్ సినిమా. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది. అనీల్ సుంకర నిర్మాత. అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే, అతడి మార్కెట్ వాల్యూను మించి ఖర్చు చేసి తీసిన సినిమా ఏజెంట్.

First Published:  23 April 2023 12:35 PM GMT
Next Story