Telugu Global
Cinema & Entertainment

Akhil - ఏజెంట్ ప్రచారం కోసం రిస్కీ స్టంట్ చేసిన అఖిల్

Akhil Akkineni - ఏజెంట్ సినిమా ప్రచారం కోసం 172 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేశాడు అఖిల్.

Akhil - ఏజెంట్ ప్రచారం కోసం రిస్కీ స్టంట్ చేసిన అఖిల్
X

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తాజాగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఏజెంట్ ట్రైలర్ ను రేపు కాకినాడలో జరిగే బిగ్ ఈవెంట్‌ లో లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని విజయవాడలో వెరైటీగా ఎనౌన్స్ చేశారు.

ట్రయిలర్ రిలీజ్ పోస్టర్ లాంచ్ సందర్భంగా అఖిల్ అక్కినేని నెవర్ బిఫోర్ ఫీట్ చేశాడు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్ లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగిన రియల్ స్టంట్ అందరినీ ఆకట్టుకుంది.

వైల్డ్ పోస్టర్ విషయానికి వస్తే.. అఖిల్ లుక్ మెస్మరైజ్ చేసింది. కండలు తిరిగిన శరీరంతో, సంకెళ్ళు తెంచుతూ బీస్ట్ మోడ్ లో కనిపించాడు అక్కినేని హీరో. ట్రైలర్‌ని ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో అనౌన్స్ చేశారు.

వైల్డ్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ట్రైలర్ డేట్, టైం లాంచ్ ఇంత వైల్డ్ గా చేశామంటే.. ట్రైలర్ ఎంత వైల్డ్ గా ఉండబోతుందో ఊహించుకోండి. 18న ట్రైలర్ లాంచ్. అందరం కాకినాడలో కలుద్దాం'' అన్నారు.

సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. అనీల్ సుంకర నిర్మాత.
First Published:  17 April 2023 2:35 AM GMT
Next Story