Telugu Global
Cinema & Entertainment

Akhil Akkineni - ప్రేక్షకులకు అఖిల్ ఓపెన్ లెటర్

Akhil Akkineni open letter - అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ కు బహిరంగ లేఖ రాశాడు. ఏజెంట్ సినిమా ఫ్లాప్ అని అంగీకరించాడు.

Akhil Akkineni - ప్రేక్షకులకు అఖిల్ ఓపెన్ లెటర్
X

ఒకప్పట్లా సినిమా ఫ్లాప్ అయితే హీరోలు ముఖం చాటేయడం లేదు. ప్రేక్షకుల ముందు తప్పు ఒప్పుకుంటున్నారు. మొన్నటికిమొన్న గని సినిమా ఫ్లాప్ అయితే బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వరుణ్ తేజ్. లైగర్ ఫ్లాప్ అయితే విజయ్ దేవరకొండ సారీ చెప్పాడు. ఇప్పుడు అఖిల్ వంతు వచ్చింది.

ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అఖిల్, ఓపెన్ లెటర్ రాశాడు. సినిమా ఫ్లాప్ అనే సంగతి అంగీకరిస్తూనే, తనకు మద్దతుగా నిలిచిన నిర్మాత అనీల్ సుంకరకు థ్యాంక్స్ చెప్పాడు. సినిమా కోసం కష్టపడిన ప్రతి టెక్నీషియన్ కు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇకపై మరింత బలంగా పనిచేస్తానని, అందరి నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమాలు చేస్తానని ప్రామిస్ చేశాడు అఖిల్. అయితే తన లేఖలో ఎక్కడా దర్శకుడు సురేందర్ రెడ్డి పేరును అతడు ప్రస్తావించలేదు.

అఖిల్ సినిమా ఫ్లాప్ అయిన వెంటనే నిర్మాత అనీల్ సుంకర రియాక్ట్ అయ్యాడు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అఖిల్ కూడా సురేందర్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా అతడిపై పరాజయ భారం మోసినట్టయింది.

First Published:  15 May 2023 4:39 PM GMT
Next Story