Telugu Global
Cinema & Entertainment

Ajith | సంక్రాంతికి సినిమా ప్రకటించిన అజిత్

Ajith - అజిత్ కు సంక్రాంతి కొత్త కాదు. రెండేళ్ల కిందట తెగింపు సినిమా విడుదల చేశాడు. వచ్చే సంక్రాంతికి ఇంకో సినిమా ప్రకటించాడు.

Ajith | సంక్రాంతికి సినిమా ప్రకటించిన అజిత్
X

మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్ లో భారీ సినిమా ప్రకటించింది. స్టార్ హీరో అజిత్ కుమార్‌తో తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది. దీని పేరు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందే ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ''దిగ్గజ స్టార్ అజిత్ కుమార్ తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్క్రిప్ట్, కథనం అద్భుతంగా ఉన్నాయి. అభిమానులు, సినిమా ప్రేమికులకు గ్రిప్పింగ్, ఆకట్టుకునే సినిమాటిక్ అనుభవాన్నిఅందించడానికి మేం రెడీ.”

కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతోంది గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా. ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నాడు దర్శకుడు రవిచంద్రన్. తను చెప్పిన స్టోరీకి అజిత్ ఓకే చెప్పడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపాడు.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రీకరణ జూన్ లో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం 2025 పొంగల్‌కు విడుదల కానుంది. ఇంతకుముందు విశాల్ తో మార్క్ ఆంటోనీ సినిమా తీశాడు రవిచంద్రన్.




First Published:  16 March 2024 10:22 AM GMT
Next Story