Telugu Global
Cinema & Entertainment

Mangalavaaram Movie - మంగళవారం టీజర్ మెస్మరైజ్ చేసింది

Mangalavaaram Movie - మంగళవారం అనే సినిమా తీస్తున్నాడు అజయ్ భూపతి. ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్, మెస్మరైజ్ చేసింది.

Mangalavaaram Movie - మంగళవారం టీజర్ మెస్మరైజ్ చేసింది
X

తను తీస్తున్న సినిమా జానర్ ను ఇప్పటివరకు ఇండియాలో ఎవ్వరూ టచ్ చేయలేదన్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆ మాటకొస్తే, వరల్డ్ సినిమాలోనే తనది డిఫరెంట్ మూవీ అని కూడా చెప్పుకొచ్చాడు. మేకర్స్ అంతా ఇలానే చెబుతారని చాలామంది చిన్నగా నవ్వి ఊరుకున్నారు. ఈరోజు రిలీజైన మంగళవారం టీజర్ చూస్తే అజయ్ భూపతి అప్పుడెప్పుడో చెప్పిన ఈ డైలాగులు గుర్తొచ్చాయి.

నిజంగానే మంగళవారం టీజర్ కొత్తగా ఉంది. కథ ఏంటో తెలీదు, జానర్ ఏంటో తెలీదు, స్క్రీన్ పై ఏం జరుగుతుందో తెలీదు, కానీ టీజర్ మాత్రం కట్టిపడేసింది. పచ్చటి తోటలు, మధ్యలో ఊరు, అందులో అమ్మవారి గుడి, వందల మంది జనం.. అంతా ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూస్తుంటారు. కేవలం జనం మాత్రమే కాదు, జంతువులు కూడా అంతే ఆశ్చర్యంగా పైకి చూస్తుంటాయి.

ఏం జరుగుతుందో అర్థంకాకముందే లీడ్ ఆర్టిస్ట్ పాయల్ రాజ్ పుత్ ను ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఎంత ఆసక్తికరంగా టీజర్ మొదలైందో, అంతే ఇంట్రెస్టింగ్ గా ముగుస్తుంది. నిజం చెప్పాలంటే, టీజర్ లో అజయ్ భూపతి ఏం చెప్పలేదు. కీలకమైన పాత్రల్ని మాత్రమే చూపించాడు. ఇవన్నీ ఒకెత్తయితే, అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. తన బీజీఎంతో అజనీష్ కట్టిపడేశాడు.

ఓవరాల్ గా 60 సెకెన్ల టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమాపై ఉత్సుకతను మరింత పెంచింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తారు. ఇందులో ప్రముఖంగా 30 పాత్రలుంటాయని, కథ మొత్తం ఆ 30 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుందని అజయ్ ఇప్పటికే ప్రకటించాడు.



First Published:  4 July 2023 1:07 PM GMT
Next Story