Telugu Global
Cinema & Entertainment

Ajay Bhupati: అజయ్ భూపతి కొత్త సినిమా సంగతులు

Ajay Bhupati: ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి ఓ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీనికి మంగళవారం అనే టైటిల్ అనుకుంటున్నాడు ఈ డైరక్టర్.

Ajay Bhupati: అజయ్ భూపతి కొత్త సినిమా సంగతులు
X

ఆర్ఎక్స్100 తర్వాత మళ్లీ మెరవలేకపోయాడు దర్శకుడు అజయ్ భూపతి. శర్వానంద్, సిద్దార్థ్ లను హీరోలుగా పెట్టి తీసిన మహాసముద్రం డిజాస్టర్ అవ్వడంతో, ఈ దర్శకుడికి అవకాశాలు ఇచ్చేవాళ్లు కరువయ్యారు. ఈ క్రమంలో ఓటీటీలోకి కూడా ఎంటరవ్వాలని ప్రయత్నించాడు. అయితే ఇప్పుడే ఓటీటీలోకి రావడం కంటే, మరో సినిమా చేయడం కరెక్ట్ అని భావిస్తున్నాడు ఈ దర్శకుడు.

ఇందులో భాగంగా మంగళవారం అనే టైటిల్ తో ఓ కథ రాసుకున్నాడు అజయ్ భూపతి. తన పాత సినిమాల స్టయిల్ లోనే ఇది కూడా రియలిస్టిక్ గా ఉండబోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే రస్టిక్ మూవీ ఇది. అయితే ఇంతకుమించి ఈ సినిమా సంగతులు తెలియవు.

కొంతమంది ఇదొక మాస్ మూవీ అంటుంటే, మరికొందరు మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమా అని చెబుతున్నారు. అజయ్ మాత్రం నటీనటులు ఫిక్స్ అయిన తర్వాతే సినిమా ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఈ కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఈ దర్శకుడు బిజీగా ఉన్నాడు.

First Published:  17 Nov 2022 5:30 AM GMT
Next Story