Telugu Global
Cinema & Entertainment

Mangalavaaram | సస్పెన్స్ బయటపెట్టిన దర్శకుడు

Mangalavaaram - మంగళవారం సినిమాలో చాలా ట్విస్టులున్నాయి. అన్నింటికంటే ప్రధానమైన ట్విస్ట్ ను దర్శకుడు బయటపెట్టేశాడు.

Mangalavaaram | సస్పెన్స్ బయటపెట్టిన దర్శకుడు
X

మంగళవారం సినిమాకు సంబంధించి కొన్ని ట్విస్టులున్నాయని, ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ ను బయటపెట్టొద్దంటూ విడుదలకు ముందు రిక్వెస్ట్ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. ఒకరిద్దరు తప్ప, అంతా దర్శకుడి విన్నపాన్ని మన్నించారు. స్పాయిలర్స్ ఇవ్వలేదు.

ఇప్పుడా సస్పెన్స్ ఏంటనేది స్వయంగా దర్శకుడే బయటపెట్టాడు. మంగళవారం సినిమాలో ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. మాలచ్చి అనే పాత్ర పోషించిన అతడు సినిమాకు కీలకంగా మారాడు. సినిమాలో ట్విస్ట్ కూడా అతడే. అదే విషయాన్ని ఈరోజు అజయ్ భూపతి బయటపెట్టాడు.

మంగళవారం సినిమాకు సంబంధించి ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ సక్సెస్ మీట్ లో మాలచ్చి వేసుకున్న మాస్క్ ను, ఆ మాస్క్ వెనకున్న నటుడ్ని హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, మీడియాకు మరోసారి థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు అజయ్ భూపతి.

పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు అజనీష్ లోక్ నాధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అయితే కాంతార-2 పనుల్లో బిజీగా ఉండడం వల్ల మంగళవారం సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ కు కూడా అతడు హాజరవ్వలేకపోయాడు.

First Published:  21 Nov 2023 5:18 PM GMT
Next Story