Telugu Global
Cinema & Entertainment

కన్నడ బాట పట్టిన సాయితేజ్

ప్రస్తుతం ఓ మిస్టరీ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు సాయితేజ్. ఈ సినిమాకు కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.

కన్నడ బాట పట్టిన సాయితేజ్
X

ఒకప్పుడు తమిళ దర్శకులకు, టెక్నీషియన్స్ కు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు కన్నడ దర్శకులకు, టెక్నీషియన్లకు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. తన కొత్త సినిమా కోసం సాయితేజ్, కన్నడ సంగీత దర్శకుడ్ని తీసుకున్నాడు.

సుప్రీమ్ హీరో సాయితేజ్ నటిస్తున్న నూతన చిత్రానికి పాన్ ఇండియా సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విక్రాంత్ రోణ, కాంతారా చిత్రాలకు సంగీతం అందించిన ఈ మ్యూజిక్ సన్సేషన్ ఇప్పుడు సాయితేజ్ నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్‌కు పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించబోతున్నాడు.

భారీ బడ్జెట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సుకుమార్ రైటింగ్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ వద్ద రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. సంయుక్త మీనన్ హీరోయిన్. ఈ సినిమాకు రుద్రవనం అనే టైటిల్ అనుకుంటున్నారు.

First Published:  13 Oct 2022 5:04 AM GMT
Next Story