Telugu Global
Cinema & Entertainment

Aishwarya Rajesh - తెలుగులో ఛాన్సులు రావడం లేదంట

Aishwarya Rajesh - టాలీవుడ్ నుంచి తనకు పెద్ద సినిమా ఆఫర్లు రావడం లేదంటోంది ఐశ్వర్య రాజేష్. ఒకింత బాధ వ్యక్తం చేసింది.

Aishwarya Rajesh - తెలుగులో ఛాన్సులు రావడం లేదంట
X

టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఇప్పుడిప్పుడే డింపుల్ హయతి, శ్రీలీల లాంటి తెలుగమ్మాయిలకు కూడా అవకాశాలొస్తున్నాయి. కానీ మరో తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదంటోంది ఈ హీరోయిన్.

"తెలుగు బిడ్డనైనా తెలుగులో నాకు పెద్ద సినిమా ఆఫర్లు తక్కువగానే వస్తున్నాయి. నాన్న గారు తెలుగు సినిమాలు చేశారు, తాతగారు తెలుగు సినిమాలు చేశారు. మా అత్త తెలుగులో 500కు పైగా సినిమాలు చేశారు. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉంది నాకు. కానీ తెలుగులో నాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకే తెలుగమ్మాయినైనా చెన్నైలో ఉంటున్నాను. తమిళ సినిమాలే చేస్తున్నాను. ఇప్పటికీ ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాం. పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. యాక్టింగ్, డాన్సింగ్ కూడా వచ్చు. కానీ పెద్ద సినిమా ఆఫర్లు నాకు రావడం లేదు."

ఐశ్వర్య రాజేష్ తండ్రి పేరు రాజేశ్. ఒకప్పుడు ఆయన ఫేమస్ హీరో. తెలుగులో దాదాపు 40 సినిమాలు చేశారు. ఇక ఐశ్వర్య రాజేష్ తల్లి క్లాసికల్ డాన్సర్. టాలీవుడ్ తో కూడా సంబంధాలున్నాయి. ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చారు. ఇక ఐశ్వర్య రాజేష్ తాత అమర్ నాధ్, టాలీవుడ్ లో ఒకప్పటి తరం క్యారెక్టర్ ఆర్టిస్టు.

ఇక ఐశ్వర్య రాజేష్ అత్త పేరు శ్రీలక్ష్మి. ఈమె గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో 500కు పైగా సినిమాల్లో నటించారు. ఇలా ఐశ్వర్య కుటుంబంలో అందరూ ఆర్టిస్టులో ఉన్నారు. టాలీవుడ్ తో ఎంతో అనుబంధం కూడా కలిగి ఉన్నారు. కానీ తనకు మాత్రం తెలుగులో పెద్ద అవకాశాలు రావడం లేదంటోంది ఐశ్వర్య.

First Published:  10 May 2023 6:55 AM GMT
Next Story