Telugu Global
Cinema & Entertainment

Aishwarya Rai | చేతికి కట్టుతో ఐశ్వర్య రాయ్

Aishwarya Rai - ఐశ్వర్య రాయ్ గాయపడింది. చేతికి కట్టుతో ఎయిర్ పోర్టులో కనిపించింది.

Aishwarya Rai | చేతికి కట్టుతో ఐశ్వర్య రాయ్
X

అందగత్తె ఐశ్వర్య రాయ్ షాకిచ్చింది. ఈరోజు ముంబయి ఎయిర్ పోర్ట్ లో చేతికి కట్టుతో ప్రత్యక్షమైంది ఐష్. దీంతో మీడియా ప్రతినిధులు షాకయ్యారు. ఏం జరిగిందంటూ ప్రశ్నించారు. అయితే ఐశ్వర్య రాయ్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే వెళ్లిపోయింది.

కొన్నాళ్ల కిందట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ పుకార్లు చెలరేగాయి. ఈ క్రమంలో చేతికి కట్టుతో ఐశ్వర్య రాయ్ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఐష్ మాత్రం నవ్వులు చిందుతూ కనిపించింది. పక్కనే ఆమె కూతురు ఆరాధ్య కూడా ఉంది.

కూతురుతో కలిసి కాన్స్ రివేరాకు వెళ్లింది ఐశ్వర్యరాయ్. ఏటా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఆమె హాజరవుతుంది. రెడ్ కార్పెట్ పై హోయలొలికిస్తుంది. అయితే ఈసారి చేతికి కట్టుతో ఆమె రెడ్ కార్పెట్ పైకి ఎలా వస్తుందనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

2002 నుంచి కాన్స్ చిత్రోత్సవానికి హాజరవుతోంది ఐశ్వర్య. తొలిసారి ఆమె చీరకట్టులో కాన్స్ వేదికపై మెరిసింది. అప్పట్నుంచి ప్రతి ఏడాది ఆమె ధరించిన దుస్తులు, ఆమె లుక్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. ఇన్నేళ్లయినా ఆమె అందం చెక్కుచెదరలేదు.

First Published:  16 May 2024 5:26 PM GMT
Next Story