Telugu Global
Cinema & Entertainment

Ahimsa Movie: అహింస మూవీ ట్రయిలర్ రివ్యూ

Ahimsa Movie trailer: దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన చిత్రం అహింస. తేజ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.

Ahimsa Movie: అహింస మూవీ ట్రయిలర్ రివ్యూ
X

దర్శకుడు తేజ కొత్త సినిమా రెడీ అయింది. దగ్గుబాటి అభిరామ్ తొలి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు 'అహింస'. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ముందుగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా అహింస థియేట్రికల్ ట్రైలర్‌ను రామ్ చరణ్ లాంచ్ చేశాడు.


ట్రైలర్ సూచించినట్లుగా.. అహింస టిపికల్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కాదు. ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ప్రేమకథ ఉన్నప్పటికీ, అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ట్రైలర్ సినిమాలోని విభిన్న కోణాలను ప్రజంట్ చేసింది


అభిరామ్‌ని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం, హీరోని కొందరు క్రిమినల్స్ వెంబడించడంతో క్రైమ్ థ్రిల్లర్‌గా ట్రైలర్ మొదలవుతుంది. ఒక ప్రముఖ క్రిమినల్ లాయర్ అభిరామ్ కేసును టేకప్ చేయడానికి నిరాకరించడంతో అభిరామ్ ని కాపాడటానికి యంగ్ లాయర్ సదా వస్తుంది.


ట్రైలర్‌.. విలేజ్ లో అభిరామ్ , మరదలు గీతికల అందమైన ప్రేమకథను కూడా చూపిస్తుంది. తన కష్టాలు నుంచి బయటపడటానికి శ్రీకృష్ణుని మార్గాన్ని అవలంబిస్తాడు అభిరామ్.


ట్రైలర్‌ చూస్తే, దర్శకుడు తేజ విభిన్నమైన కథాంశంతో వచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రం క్రైమ్ అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంది. అభిరామ్ చాలా షేడ్స్‌తో కూడిన ఇంటెన్స్ క్యారెక్టర్‌లో అద్భుతంగా కనిపించాడు. ఇందులో గీతిక అతని ప్రేయసిగా ఆకట్టుకుంది. సదా లాయర్‌గా కీలకమైన పాత్రలో కనిపించారు.

ఆర్‌పి పట్నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీ ఉంది. త్వరలోనే సినిమాను థియేటర్లలోకి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.



First Published:  13 Jan 2023 4:13 PM GMT
Next Story