Telugu Global
Cinema & Entertainment

Ahimsa Movie - అహింస మూవీ విడుదల తేదీ

Ahimsa Movie release date - దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న సినిమా అహింస. వేసవి కానుకగా సినిమా విడుదలకానుంది.

Ahimsa Movie - అహింస మూవీ విడుదల తేదీ
X

ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ అయిన తేజ, తనదైన శైలిలో మరో ప్రేమకథను ఆవిష్కరించాడు. అదే అహింస. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. నిర్మాత సురేష్ బాబు చిన్నకొడుకు దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'అహింస' ఫస్ట్ లుక్, టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'నీతోనే నీతోనే', 'కమ్మగుంటదే' పాటలు కూడా హిట్టయ్యాయి.

తాజాగా మేకర్స్ ‘అహింస’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అహింస ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలకానుంది. అనౌన్స్‌మెంట్ లో భాగంగా అహింస సినిమాకు సంబంధించి మరిన్ని స్టిల్స్ రిలీజ్ చేశారు. తదుపరి ప్రమోషన్‌లను త్వరలోనే ప్రారంభిస్తారు.

ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించాడు. దాదాపు ఐదేళ్లుగా నలుగుతున్న అభిరామ్ తెరంగేట్రానికి ఈ ఏడాది వేదిక కానుందన్నమాట.

First Published:  6 March 2023 5:40 PM GMT
Next Story