Telugu Global
Cinema & Entertainment

అహింస ఫస్ట్ గ్లింప్స్ అదిరింది

నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న సినిమా అహింస. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. అభిరామ్ ఫేస్ చూపించలేదు కానీ, సినిమా ఎలా ఉండబోతోందో చెప్పారు.

అహింస ఫస్ట్ గ్లింప్స్ అదిరింది
X

దర్శకుడు తేజ ప్రస్తుతం 'అహింస' అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో నూతన నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రీ లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది.

హీరోని అటవీ ప్రాంతంలో ఒక గ్రూప్ అతని ముఖాన్ని జూట్ బ్యాగ్‌తో కప్పి లాక్కొని వెళ్ళడం కనిపిస్తోంది. అతని ముఖం నుండి రక్తం కారేలా గూండాలు దారుణంగా కొట్టడం గ్లింప్స్ లో చూడవచ్చు. అహింస అనే టైటిల్‌ ఉన్నప్పటికీ సినిమాలో యాక్షన్‌ డోస్‌ హెవీగా ఉందని అర్ధమౌతోంది.

ఈ చిత్రంతో నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గీతిక హీరోయిన్ గా నటిస్తోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్ పై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు.

చాలా కాలం తర్వాత, తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ 'అహింస' కోసం కలిసింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. సదా, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.



First Published:  10 Sep 2022 3:43 AM GMT
Next Story