Telugu Global
Cinema & Entertainment

ఆహాలోకి ఎంటరైన ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం హైవే. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది.

ఆహాలోకి ఎంటరైన ఆనంద్ దేవరకొండ
X

ఆహా యాప్ కు విజయ్ దేవరకొండకు ఇప్పటికే ఓ అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఆహాతో ఎటాచ్ అయ్యాడు. ఈ హీరో నటించిన కొత్త సినిమాను ఆహా యాప్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజ్ చేయకుండా, నేరుగా తమ ఓటీటీలో డైరక్ట్ గా రిలీజ్ చేయబోతోంది. ఆ సినిమా పేరు హైవే.

ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా, కే వి గుహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆహా స్క్రీన్స్ మీద రాబోతుంది. వెంకట్ తలారీ ఈ సినిమాకు నిర్మాత.

కథ విషయానికివస్తే ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ 'డి' అనే పేరుతో ప్రవేశిస్తాడు. విష్ణు తన తులసిని కాపాడుకోగలిగాడా? ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకలాజికాల్ థ్రిల్లర్ సినిమా ఉండబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి. ఈ సినిమా పోస్టర్ ను ఆహా ఆవిష్కరించింది.

నిజానికి ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ చిన్న సినిమాలు చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి టైమ్ లో సినిమాను విడుదల చేస్తే ఏరికోరి చేజేతులా ఫ్లాప్ కొనితెచ్చుకున్నట్టే. పైగా ఈ కంటెంట్ ఓటీటీకి బాగుంది. అందుకే ఆహాతో ఒప్పందం కుదుర్చుకొని ఇలా వస్తున్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ చెబుతారు.



First Published:  6 Aug 2022 8:13 AM GMT
Next Story