Telugu Global
Cinema & Entertainment

ఏజెంట్ టీజర్ రివ్యూ.. అఖిల్ సిక్స్ ప్యాక్ అవతార్

అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ మూవీ టీజర్ రిలీజైంది.. అది ఎలా ఉందంటే..?

ఏజెంట్ టీజర్ రివ్యూ.. అఖిల్ సిక్స్ ప్యాక్ అవతార్
X

హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్‌ ను అభిమానులు కోలాహం మధ్య హైదరాబాద్ లోని మల్లికార్జున్ థియేటర్ లో గ్రాండ్ గా లాంచ్ చేసింది ఏజెంట్ చిత్ర బృందం. అఖిల్, సాక్షి వైద్య, సురేందర్ రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర, డీవోపీ రసూల్ ఎల్లోర్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఈ సినిమా తమిళ టీజర్ ను శివ కార్తికేయన్, కన్నడ టీజర్ ను కిచ్చా సుదీప్, మలయాళం వెర్షన్ టీజర్ ను మమ్ముట్టి విడుదల చేశారు. వీటితో పాటు హిందీ వెర్షన్ టీజర్ కూడా విడుదలైంది.

నిమిషం16 సెకన్లు నిడివి గల ఏజెంట్ టీజర్ లో కంప్లీట్ యాక్షన్, స్టయిల్ కనిపించింది. నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీహెడ్ మహదేవ్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టిని విచారిస్తుండగా.. అతను ఏజెంట్ క్యారెక్టర్ గురించి పవర్ ఫుల్ గా వివరించడం ఆసక్తికరంగా ఉంది. అతన్ని పట్టుకోగలమా అని ఓ ఆఫీసర్ అడిగితే.. ''నో హీఈజ్ అన్ ప్రిడిక్టబుల్. నో విట్నేస్, నో ఫారిన్సిక్ ఎవిడెన్స్. అతని డెత్‌ నోట్‌ ఆల్రెడీ రాసుంది'' అంటూ ఏజెంట్ క్యారెక్టర్ ను మమ్ముట్టి వివరించడం బాగుంది.

మహదేవ్ పాత్ర చెప్పినట్లే టీజర్ లో అఖిల్ యాక్షన్ అవుట్ స్టాండింగ్ గా వుంది. చావుకు భయపడని ఏజెంట్ పాత్రలో కనిపించాడు అఖిల్. అఖిల్, మమ్ముట్టి పాత్రలతో పాటు హీరోయిన్ సాక్షి వైద్య ను కూడా టీజర్ లో పరిచయం చేశారు. టీజర్ మొత్తం స్టైలిష్‌గా ఉంది, సురేందర్ రెడ్డి, రసూల్ ఎల్లోర్ కలిసి ఏజెంట్ వరల్డ్ ని అద్భుతంగా చిత్రీకరించారు. హిప్ హాప్ తమిజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏజంట్ పాత్రని మరింత బాగా ఎలివేట్ చేసింది.

వక్కంతం వంశీ కథ అందించగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది.



First Published:  16 July 2022 2:49 AM GMT
Next Story