Telugu Global
Cinema & Entertainment

రేపే ఏజెంట్ టీజర్

అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా టీజర్ రెడీ అయింది. రేపు సాయంత్రం 5:05 గంటలకు విడుదల కానుంది.

రేపే ఏజెంట్ టీజర్
X

హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ప్రాజెక్ట్ ఏజెంట్. ఈ సినిమా టీజర్ రెడీ అయింది. రేపు సాయంత్రం 5:05 గంటలకు విడుదల కానుంది. అఖిల్ నటించిన తొలి ఫుల్ లెంగ్త్ యాక్షన్-ప్యాక్డ్ సినిమా ఇది. పైగా ఏజెంట్ గా నటించడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. తాజాగా మరో పోస్టర్ రిలీజైంది.

పోస్టర్‌లో శరీరమంతా గాయాలతో కనిపిస్తున్నాడు అఖిల్. పక్కనే గాట్లింగ్ గన్‌తో కాల్చడం కనిపించింది. అఖిల్ స్టైలిష్‌గా, పోనీటైల్‌తో డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ తో రేపు రిలీజ్ అవ్వబోయే టీజర్ లో ఫుల్ యాక్షన్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

స్టైలిష్‌ మేకర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో టీజర్‌ను ఒకేసారి విడుదల చేయనున్నారు.

ఏజెంట్ పాత్రకు అవసరమైన విధంగా తనను తాను మార్చుకోవడానికి అఖిల్ చాలా కష్టపడ్డాడు. అతను కోరుకున్న ఆకృతిని పొందడానికి చాలా కష్టపడ్డాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై వస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు. హిపాప్ తమీజా ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.





First Published:  14 July 2022 12:14 PM GMT
Next Story