Telugu Global
Cinema & Entertainment

Agent Movie: ఫైనల్ షెడ్యూల్ కు అంతా రెడీ

Akhil Akkineni's Agent Movie shooting updates: అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ మూవీ shooting ఫైనల్ స్టేజ్ కి చేరింది

Agent Movie: ఫైనల్ షెడ్యూల్ కు అంతా రెడీ
X

Agent Movie: ఫైనల్ షెడ్యూల్ కు అంతా రెడీ

అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఫైనల్ షెడ్యూల్, మస్కట్ లో మొదలైంది.


ఈ చివరి షెడ్యూల్ లో అఖిల్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ కట్స్ తో సినిమా టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు ఏజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.


ఏప్రిల్ 28న ఏజెంట్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తొలి సింగిల్ ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చింది. హిపాప్ తమిళ కంపోజ్ చేసిన ఈ పెప్పీ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


అఖిల్ ఏజెంట్ గా నటించిన హై-యాక్షన్ మూవీ ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయింది.

First Published:  24 Feb 2023 11:22 AM GMT
Next Story