Telugu Global
Cinema & Entertainment

HIT 2: ప్రామిసింగ్ టీజర్

అడివి శేష్ నటిస్తున్న తొలి సీక్వెల్ మూవీ హిట్ 2. నాని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉందో చూద్దాం..

HIT 2: ప్రామిసింగ్ టీజర్
X

క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 2'. 'ది సెకండ్ కేస్' ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

'హిట్'లో ఫస్ట్ కేస్ అంటూ ఒకమ్మాయి మిస్సింగ్ కేసు చూపించి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన దర్శకుడు శైలేష్, 'హిట్2' లో కూడా మరో ఇంట్రెస్టింగ్ కేసు తీసుకున్నాడని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఒకమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికిన సీన్ ను టీజర్ లో చూపించారు. ఈ మర్డర్ కేసుని కృష్ణ దేవ్ అలియాస్ కేడీ ఎలా డీల్ చేశాడు? హంతకులను ఎలా పట్టుకున్నాడనేది ఆసక్తి కలిగించేలా ఉంది.

టీజర్ ఆరంభంలో శేష్ క్యారెక్టర్, ఆ పాత్ర ద్వారా పుట్టే ఫన్ చూపిస్తూ సినిమాలో ఎంటర్టైన్ మెంట్ కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మంచి లవ్ ట్రాక్ కూడా ఉన్నట్టు టీజర్ లో చూపించారు. చివర్లో సెకండ్ కేస్ అంటూ ఓ ఇంట్లో జరిగిన అమ్మాయి మర్డర్ చూపిస్తూ ముగించారు.

ఓవరాల్ గా హిట్2 టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్న ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఎం.ఎం,శ్రీలేఖ , సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజర్స్.



First Published:  4 Nov 2022 3:24 AM GMT
Next Story