Telugu Global
Cinema & Entertainment

Goodachari 2: ఫస్ట్ లుక్ విడుదల

Adivi Sesh's Goodachari 2: గూఢచారి 2 ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రాబోతోంది

Goodachari 2: ఫస్ట్ లుక్ విడుదల
X

HIT-2తో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశాడు. గూఢచారి సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించాడు.


“మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు “ప్రీ విజన్” వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఫార్మల్ అవుట్ ఫిట్ లో స్టైలిష్ లుక్‌ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం ఫస్ట్ లుక్ లో చూపించారు.


ప్రీ-విజన్ విషయానికి వస్తే, శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు.



First Published:  10 Jan 2023 7:00 AM GMT
Next Story