Telugu Global
Cinema & Entertainment

Adivi Sesh: ప్రేమ విషయంలో బోర్డర్ లో ఉన్నాను

Adivi Sesh: హీరో అడివి శేష్ ప్రేమలో ఉన్నాడా లేదా? ఈ విషయం తనకే తెలియదంటున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ప్రేమ విషయంలో బోర్డర్ లో ఉన్నానంటున్నాడు.

Adivi Sesh: ప్రేమ విషయంలో బోర్డర్ లో ఉన్నాను
X

హీరో అడవి శేష్ తన ప్రేమ ముచ్చట్లు బయటపెట్టాడు. హిట్-2 మూవీ ప్రమోషన్ లో మీడియా మొత్తం ఏకమై పెళ్లి-ప్రేమ గురించి అడగడంతో శేష్ కు ఇక చెప్పక తప్పలేదు. ప్రస్తుతం తను ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉన్నానని ప్రకటించాడు ఈ హీరో. ఆ అమ్మాయిది కూడా హైదరాబాద్ అని స్పష్టం చేశాడు.

అయితే తను ప్రేమలో ఉన్నానా లేదా అనే విషయాన్ని మాత్రం శేష్ బయటపెట్టలేదు. ఎందుకంటే, ప్రేమపై తనకే ఇప్పటివరకు క్లారిటీ రాలేదని ప్రకటించాడు. ప్రస్తుతం తను ఆ అమ్మాయి గురించి పెద్దగా ఆలోచించడం లేదని, సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని తెలిపాడు. అంతేకాదు, తన కుటుంబానికి కూడా తను టైమ్ కేటాయించే పరిస్థితిలో లేనని బాధపడ్డాడు.

ఇలాంటి టైమ్ లో ఆ అమ్మాయి కోసం మైండ్, టైమ్ కేటాయించగలనా అనే డైలమా తనలో ఉందని, అందుకే ప్రేమ విషయంలో ప్రస్తుతం తను బోర్డర్ లో ఉన్నానని వెల్లడించాడు.

మొత్తానికి అడివి శేష్, ఓ అమ్మాయితో క్లోజ్ గా ఉన్నాడనే విషయంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఒక్కసారి దగ్గరయ్యాడు కాబట్టి, ఇక ప్రేమలో పడడం పెద్ద కష్టం కాదంటున్నారు చాలామంది. ఎందుకంటే, అడివి శేష్ దగ్గర ఇప్పుడు అందం, ఆకర్షణతో పాటు సక్సెస్-డబ్బు కూడా ఉంది మరి.

First Published:  2 Dec 2022 5:26 AM GMT
Next Story