Telugu Global
Cinema & Entertainment

అరుదైన ఘనత సాధించిన అడివి శేష్

ఐఎండీబీ రేటింగ్స్ ఛార్టుల్లో అడివి శేష్ సంచలనం సృష్టించాడు. ఇతడు నటించిన 3 సినిమాలు లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి.

అరుదైన ఘనత సాధించిన అడివి శేష్
X

సినిమాల రేటింగ్స్ లో స్టార్ స్టేటస్, బడ్జెట్‌ లాంటివి ప్రామాణికాలు కావు. ఓ సినిమా వరల్డ్ వైడ్ ఎంత సక్సెస్ సాధించిందనేది, ప్రముఖ అంతర్జాతీయ పోర్టల్‌ల రేటింగ్‌ల పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సినిమాలకు కచ్చితమైన రేటింగ్‌లు ఇచ్చే విషయంలో అలాంటి ప్రముఖ పోర్టల్స్ లో IMDB ఒకటి.

తాజాగా ఈ సంస్థ, టాలీవుడ్ కు సంబంధించి ఆల్-టైమ్ 25 తెలుగు సినిమాల జాబితాను విడుదల చేసింది వీటిలో మొదటి 3 ర్యాంక్స్ లో C/o కంచరపాలెం, మాయాబజార్, జెర్సీ నిలిచాయి.

విచిత్రమేమిటంటే, ఈ లిస్ట్ లో అత్యధిక సినిమాలు కలిగిన హీరోగా అడివి శేష్ నిలిచాడు. అడివి శేష్ నటించిన 3 సినిమాలకు టాప్-25లో చోటు దక్కడం విశేషం. క్షణం, ఎవరు, మేజర్ చిత్రాలు 17, 18, 22వ ర్యాంక్స్ లో నిలిచాయి.

వైవిధ్యమైన పాత్రలు చేయడంలో, విలక్షణమైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు అడివి శేష్. మరీ ముఖ్యంగా ఇతడి అతిపెద్ద బలం రైటింగ్. అదే ఇతడికి ఈ స్థాయి తెచ్చిపెట్టింది. తాజాగా మేజర్ తో మరో పెద్ద హిట్ అందుకున్న ఈ హీరో, త్వరలోనే హిట్-2, గూఢచారి-2 సినిమాలతో అలరించబోతున్నాడు.

First Published:  16 Oct 2022 1:30 PM GMT
Next Story