Telugu Global
Cinema & Entertainment

Adivi Sesh | ఒకేసారి 2 పాన్ ఇండియా సినిమాలు

Adivi Sesh - ఈ ఏడాది మొత్తం థియేటర్లలోకి రాలేదు అడివి శేష్. వచ్చే ఏడాది మాత్రం 2 సినిమాలు వస్తాయంటున్నాడు.

Adivi Sesh | ఒకేసారి 2 పాన్ ఇండియా సినిమాలు
X

అడివి శేష్ వైవిధ్యమైన చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్ 2, మేజర్ లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ప్రస్తుతం గూఢచారి2, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న మరో సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమౌతున్నాడు.

ఈ రోజు అడివి శేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు ఈ నటుడు. తన రాబోయే సినిమాలు రెండూ పాన్ ఇండియా సినిమాలేనని చెబుతున్నాడు.

"ఇకపై నా సినిమాలన్నీ హిందీలో కచ్చితంగా విడుదలౌతాయా అనేది చెప్పలేను. అది సినిమా సబ్జెక్ట్ బట్టి ఉంటుంది. జి2 (గూఢచారి 2) చాలా పెద్ద సినిమా. 5 దేశాల్లో జరిగే కథ. కాబట్టి హిందీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇక శృతిహాసన్ తో చేస్తున్న సినిమాను ప్రాపర్ గా హిందీ, తెలుగు భాషల్లో వేటికవే సెపరేట్ గా షూట్ చేస్తున్నాం. నార్త్-సౌత్ సంస్కృతి ప్రకారం, సినిమాలో ప్రతి సీన్, ట్రీట్మెంట్ దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది. నటీనటీనటుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తెలుగు, హిందీ భాషలపై పట్టున్న నటులని ఎంపిక చేశాం."

ఈ ఏడాది శేష్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే తనకు బాధ లేదంటున్నాడు. ఈ ఏడాది మొత్తం ప్రిపరేషన్ లోనే గడిచిందని, రైటింగ్ లోనే ఎక్కువ సమయం గడిపానని తెలిపాడు.

First Published:  17 Dec 2023 8:33 AM GMT
Next Story