Telugu Global
Cinema & Entertainment

Adipurush - ప్రభాస్ ఆదిపురుష్ ప్రచారంపై అప్ డేట్

Adipurush promotions - రేపటి నుంచి అదిపురుష్ ప్రచారం స్టార్ట్ అవుతుంది. దర్శకుడు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు

Adipurush - ప్రభాస్ ఆదిపురుష్ ప్రచారంపై అప్ డేట్
X

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16 న విడుదల కాబోతోంది. శ్రీ రామ నవమి నుంచి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. ఈ సందర్బంగా దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ మాతా వైష్ణో దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆశిస్సులు అందుకున్నారు.


ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ గా నిలిచిన ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీ రాముడిగా, కృతి సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించబోతున్నారు. హనుమంతుడుగా సన్నీ సింగ్ నటించాడు. చెడుపై గెలిచిన మంచిని చూపిస్తూ .. ఆధునిక కాలానికి అన్వయించి రాబోతోన్న ఆదిపురుష్ తో ప్రభాస్ మరో భారీ హిట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు.


ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఈ నెల 30 నుంచి భారీ ఎత్తున స్టార్ట్ చేస్తారు.

ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తో సిరీస్, భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ లు యూ.వి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.


రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ఇదే. రాధేశ్యామ్ ఫ్లాప్ నుంచి బయటపడాలంటే, ఆదిపురుష్ కచ్చితంగా హిట్టవ్వాలి.

First Published:  29 March 2023 2:10 PM GMT
Next Story