Telugu Global
Cinema & Entertainment

Adipurush Pre-release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు

Adipurush Pre-release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు మొదలయ్యాయి. డేట్ ఆల్రెడీ లాక్ అయింది.

Adipurush Pre-release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు
X

Adipurush Pre-release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్‌. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసంలోని ఓ ఘట్టంగా తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడుగా, కృతి సనన్ జానకిగా నటించిన ఈ చిత్రంలో సన్ని సింగ్ హనుమంతుడుగా, సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రల్లో నటించారు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవెయిటెడ్ అనిపించుకున్న ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఓ గొప్ప కథను వెండితెరపై చూడబోతున్నాం అనే ఆసక్తిని అందరిలోనూ క్రియేట్ చేసింది ఆదిపురుష్‌. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ఆదిపురుష్‌. దీనికి సంబంధించి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక సిద్ధమైంది.

జూన్ 6న తిరుపతిలో అత్యంత వైభవంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నా .. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుపతి క్షేత్రంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం చారిత్రాత్మకంగా చెప్పొచ్చు. ఇందుకోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు.

ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగావిడుదల కాబోతోంది.

Next Story