Telugu Global
Cinema & Entertainment

Adipurush Movie Premiere: అమెరికాలో ఈ రోజు ‘ఆదిపురుష్’ ప్రీమియర్స్ ఫ్రీ!

Adipurush movie premiere Show: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక ‘ఆదిపురుష్’ బాక్సాఫీసు మంచి ఊపులో వుంది.

Adipurush Movie Premiere: అమెరికాలో ఈ రోజు ‘ఆదిపురుష్’ ప్రీమియర్స్ ఫ్రీ!
X

Adipurush Movie Premiere: అమెరికాలో ఈ రోజు ‘ఆదిపురుష్’ ప్రీమియర్స్ ఫ్రీ!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక ‘ఆదిపురుష్’ బాక్సాఫీసు మంచి ఊపులో వుంది. యూఎస్ లో ప్రదర్శించనున్న ప్రీమియర్ షోలు మిలియన్ డాలర్లు సంపాదించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇండియా కంటే ముందే యుఎస్‌లో ‘ఆదిపురుష్’ ప్రీమియర్లని ప్రదర్శించడం ఆశ్చర్యపర్చే అంశమే. తెలుగుయేతర పంపిణీదారు ఏఎంసి స్టబ్స్ ఈ ప్రీమియర్స్ ని ప్రదర్శిస్తోంది. భారతదేశంలో విడుదలకి ఒక రోజు ముందు అంటే ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ లో ప్రీమియర్స్ ని ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసింది. తెలుగేతర డిస్ట్రిబ్యూటర్ల ఈ అనూహ్య చర్య చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా, సినిమా రన్ ముగిసే సమయానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ సందర్భంలో, డిస్ట్రిబ్యూటర్లు ఒక పెద్ద తెలుగు స్టార్ సినిమాకోసం సాహసోపేతమైన ఈ చర్య తీసుకున్నారు.

ఏఎంసీ స్టబ్స్ ఏ-లిస్ట్ పాస్ హోల్డర్లు ‘ఆదిపురుష్’ టిక్కెట్లని ఉచితంగా బుక్ చేసుకోవడానికి అనుమతించాలనేది చాలా అరుదైన నిర్ణయం. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సాధారణంగా పెద్ద స్టార్ సినిమాల కోసం ముందస్తు ఖర్చుల్ని, వడ్డీ భారాన్నీ ఎదుర్కొన్నప్పుడు సినిమా రన్ తరువాతి దశల కోసం ఇలాంటి ఆఫర్స్ ని రిజర్వ్ చేస్తారు. అయితే, ఉత్తర అమెరికాలోని ‘ఆదిపురుష్’ పంపిణీదారు ఏఏ ఫిల్మ్స్, వైవా ఎంటర్‌టైన్మెంట్స్ తో కలిసి ఈ అసాధారణ చర్యని చేపట్టింది.

ఈ సందర్భంగా ఏఎంసీ స్టబ్స్ గురించి తెలుసుకుంటే- ఏఎంసి అంటే అమెరికా మల్టీ సినిమా థియేటర్ గ్రూపు. 2016 లో ఈ గ్రూపు ఒక స్కీము ప్రారంభించింది. దీని ప్రకారం ఏ- లిస్ట్ సభ్యులుగా చేరిన వారు నెలకు 20 డాలర్లు చెల్లిస్తారు. దీంతో అందుబాటులో వున్న ప్రతి షో టైమ్‌లో, ప్రతి ఏఎంసీ లొకేషన్‌లో, ఏఎంసీలో ఐమాక్స్ సినిమా, ఏఎంసీలో డాల్బీ సినిమా, ఏఎంసీ లో రియల్‌ త్రీడీ సినిమా, ప్రైమ్‌లో రియల్‌ త్రీడీ సినిమా సహా ప్రతి ఫార్మాట్‌లో వారానికి గరిష్టంగా మూడు సినిమాల్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ సభ్యులకే అదనపు రుసుము లేకుండా ఈ రోజు ‘ఆదిపురుష్’ ప్రీమియర్స్ చూసే సౌకర్యం కల్పించారు! ఇందుకే ఇది ఆశ్చర్య పర్చే చర్య అయింది. ఇదిగాక ఏఎంసీ థియేటర్స్ వెబ్సైట్ లో సినిమాల లిస్టులో, ‘ఆదిపురుష్’ ప్రీమియర్స్ తర్వాత షోలకు అడ్వాన్స్ టికెట్స్ ఆప్షన్ ఎలాగూ వుంది.



ఇదిలా వుంటే నివేదికల ప్రకారం, ‘ఆదిపురుష్’ ఇప్పటికే వివిధ ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్సు బుకింగ్స్ లో అద్భుత పనితనం చూపిస్తోంది. ఒక్క యూఎస్ లో బుధవారం ఉదయం నాటికి 490,000 డాలర్లు (సుమారు రూ. 4.10 కోట్లు) వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో 150,000 డాలర్లు (సుమారు రూ. 83 లక్షలు) కి చేరుకుంది. బ్రిటన్ లో 55,000 పౌండ్లు (రూ. 50 లక్షలు), కెనడాలో 30,000 డాలర్లు ( రూ. 25 లక్షలు) విలువైన టిక్కెట్ల విక్రయాలు జరిగాయి. ఇక యూరప్ లో, ఆగ్నేయాసియాలో రూ. 40 లక్షలకి పైగా అమ్మకాలు జరిగాయి.

‘ఆదిపురుష్’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ. 6 కోట్లు దాటాయి, విడుదల రోజు నాటికి ఈ మొత్తం రూ. 10 కోట్లకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏఎంసీ ని పక్కన బెడితే, యూఎస్ ప్రీమియర్ షోలు ఒక్కటే సినిమా బాక్సాఫీసు విజయానికి గణనీయంగా దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రీమియర్ షోలు మిలియన్ డాలర్లు ( రూ. 8 కోట్లు) వసూలు చేయవచ్చని భావిస్తున్నారు.

రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ లో ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్ నాగే ప్రధాన పాత్రల్లో నటించారు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదీని ప్రకటించడంతో ‘ఆదిపురుష్’ చుట్టూ వున్న సందడి ఇంతా అంతా కాదు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ‘ఆదిపురుష్’ అత్యంత ఖరీదైన ధరతో టికెట్స్ ని అమ్మకానికి పెట్టారు. బుక్ మై షో ప్రకారం, పీవీఆర్ డైరెక్టర్స్ కట్, యాంబియన్స్ మాల్‌లో టికెట్ ధర అక్షరాలా రెండు వేల 200 రూపాయలు!

‘ఆదిపురుష్’ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న అసాధారణ నిర్ణయం ఒకవైపు ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే ఈ సాహసోపేతమైన నిర్ణయం ఫలిస్తుందా లేదా అన్నది కాలమే చెప్తుంది.

First Published:  15 Jun 2023 7:44 AM GMT
Next Story