Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ పుట్టినరోజు.. ఒకేసారి 2 అప్ డేట్స్

Prabhas Birthday: ప్రభాస్ పుట్టినరోజుకు ఆదిపురుష్, సలార్ నుంచి క్రేజీ అప్ డేట్స్ రాబోతున్నాయి. ఈ మేరకు రెండు నిర్మాణ సంస్థలు ఈ విషయాన్ని నిర్థారించాయి

Prabhas Birthday
X

మరికొన్ని రోజుల్లో ప్రభాస్ బర్త్ డే వస్తోంది. అయితే తన పెదనాన్న కృష్ణంరాజును పోగొట్టుకున్న బాధలో ఉన్న ప్రభాస్, ఈసారి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం లేదు. కానీ అతడి సినిమా అప్ డేట్స్ మాత్రం రాబోతున్నాయి. ప్రభాస్ పుట్టినరోజున, అతడు నటిస్తున్న 2 సినిమాల నుంచి 2 అప్ డేట్స్ వస్తున్నాయి.

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ బర్త్ డేకు మరో పోస్టర్ లేదా వీడియో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ నుంచి బర్త్ డే గిఫ్ట్ రాకపోవచ్చని చాలామంది భావిస్తున్నారు. మరికొందరు మాత్రం సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాను పక్కనపెడితే.. ఆదిపురుష్, సలార్ నుంచి మాత్రం అప్ డేట్స్ గ్యారెంటీ.

First Published:  19 Oct 2022 4:23 AM GMT
Next Story