Telugu Global
Cinema & Entertainment

Adikeshava | ఆదికేశవ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

Adikeshava - థియేటర్లలో ఫ్లాప్ అయిన ఆదికేశవ సినిమా ఓటీటీలోకి వస్తోంది. కనీసం ఓటీటీలోనైనా హిట్టవుతుందా..?

Adikeshava | ఆదికేశవ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
X

ఆదికేశవ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ నవంబర్ 24 న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దారుణమైన రివ్యూస్ తో ప్రారంభమైంది. ఓపెనింగ్ రోజు నాడే బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయింది. ఇప్పుడు, ఆదికేశవ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

ఆదికేశవ మూవీ డిసెంబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఫ్లాప్ అయిన సినిమాలన్నీ దాదాపు 10 రోజులు లేదా 2 వారాల గ్యాప్ లోనే ఓటీటీలోకి వచ్చేస్తాయి. అయితే ఆదికేశవ సినిమాను అలా 10 రోజుల్లోనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తే, ఫ్లాప్ అయిందని ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుకే 4 వారాలు గ్యాప్ ఇచ్చారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మంచి లీడ్ పెయిర్ కాంబో, పెద్ద ప్రొడక్షన్ హౌస్, వాణిజ్య అంశాలు, అన్నీ సెట్ అయినప్పటికీ చీప్ కంటెంట్ కారణంగా ఆదికేశవ నిలదొక్కుకోలేకపోయింది.

సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. జోజు జార్జ్, అపర్ణా దాస్ లాంటి నటీనటులు ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

First Published:  16 Dec 2023 3:20 PM GMT
Next Story