Telugu Global
Cinema & Entertainment

పెళ్లి ఫొటోలు రిలీజ్ చేసిన పూర్ణ

మరో హీరోయిన్ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈసారి పూర్ణ వంతు. తనకు ఏంగేజ్ మెంట్ పూర్తయిందని చెప్పిన పూర్ణ, సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తాజాగా ఫొటోలు రిలీజ్ చేసింది.

పెళ్లి ఫొటోలు రిలీజ్ చేసిన పూర్ణ
X

టాలీవుడ్ హీరోయిన్లలో పూర్ణ ఒకరు. పెద్దగా క్రేజ్ రాకపోయినా, ఆమె సీనియర్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడీ భామ పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఫొటోల్ని తాజాగా బయటపెట్టింది.

తనకు పెళ్లి ఫిక్స్ అయ్యింద‌ని పూర్ణ ఎప్పుడో చెప్పింది. నిశ్చితార్థం కూడా అయ్యిందని వెల్లడించింది. కానీ పెళ్లి గురించి మాత్రం ఎటువంటి హింట్ ఇవ్వలేదు. ఆమె రేపోమాపో పెళ్లి చేసుకుంటుందని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఆమె పెళ్లి అయిపోయింది.

కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నానని త్వరలోనే స్నేహితులు-సన్నిహితులకు కేరళలో పెద్ద పార్టీ ఇస్తామని అంటోంది పూర్ణ. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పూర్ణ భర్త దుబాయ్ లో పెద్ద వ్యాపారవేత్త. అతడి పేరు షానిద్ అసిఫ్ అలీ. పెళ్లి సందర్భంగా తన భార్యకు 1700 గ్రాముల బంగారం పెట్టాడట అసిఫ్ అలీ. అంతేకాదు, దుబాయ్ లో ఓ లగ్జరీ హౌజ్ ను ఆమె పేర రాసి బహుమతిగా అందించాడట.










First Published:  27 Oct 2022 3:53 AM GMT
Next Story