Telugu Global
Cinema & Entertainment

మీనా.. వ‌చ్చేశారు..! - చిన్న గ్యాప్ అనంత‌రం షూటింగ్‌కి రెడీ

Actress Meena: మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్.. ఈ ఏడాది క‌రోనా కార‌ణంగా అనారోగ్యానికి గురై మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ పెను విషాదం నుంచి కోలుకోవ‌డానికి మీనాకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది.

Actress Meena
X

మీనా.. వ‌చ్చేశారు..! - చిన్న గ్యాప్ అనంత‌రం షూటింగ్‌కి రెడీ

సినీ న‌టి మీనా త‌న జీవితంలో ఇటీవ‌ల చోటుచేసుకున్న పెను విషాదం అనంత‌రం మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చేశారు. చిన్న గ్యాప్ అనంత‌రం షూటింగ్‌కి సిద్ధ‌మ‌య్యారు. గ‌తంలో తాను అంగీక‌రించిన చిత్రాల‌ను పూర్తిచేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఆమె చిత్రాలు మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒక్కొక్కటి చొప్పున పెండింగ్‌లో ఉన్నాయి.


దీనితో పాటు మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న మ‌ల‌యాళంలో దృశ్యం-3 చిత్రంలోనూ న‌టించే అవ‌కాశాలున్నాయి. తాజాగా ఓ ప్ర‌చార చిత్రంలో న‌టిస్తున్నారు. దానికి సంబంధించిన అప్‌డేట్ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు మీనా.

మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్.. ఈ ఏడాది క‌రోనా కార‌ణంగా అనారోగ్యానికి గురై మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ పెను విషాదం నుంచి కోలుకోవ‌డానికి మీనాకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. సీనియ‌ర్ న‌టీమ‌ణులు ఖుష్బు, రంభ‌, సంఘ‌వి ఇటీవ‌ల ఆమె ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. మాన‌సిక వేద‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి విదేశీ ప‌ర్య‌ట‌న చేసి వ‌చ్చారు మీనా. దీంతో కాస్త తేరుకున్న ఆమె పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తిచేయ‌డానికి కెమెరా ముందు రావ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

మీనా పున‌రాగ‌మ‌నం.. ఆమె అభిమానుల‌కు తీపి క‌బురు లాంటిదే. త‌మ అభిమాన న‌టి తీవ్ర విషాదం నుంచి కోలుకుని తిరిగి కెమెరా ముందుకు రావ‌డం, సినిమాల్లో న‌టించ‌నుండ‌టం మ‌రి వారికి ఆనందం క‌లిగించే విష‌య‌మేక‌దా.

First Published:  26 Dec 2022 3:40 AM GMT
Next Story