Telugu Global
Cinema & Entertainment

Actor Vikram | వీర ధీర సూరన్.. పక్కా మాస్

Actor Vikram - విక్రమ్ తాజా చిత్రం వీరధీర సూరన్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Actor Vikram | వీర ధీర సూరన్.. పక్కా మాస్
X

విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ హీరోగా హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’. విక్ర‌మ్ 62వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. రీసెంట్‌గా విడుద‌లైన టైటిల్ టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. తెన్ కాశీలో భారీ సెట్ వేసి సినిమాను పూర్తి చేస్తున్నారు మేక‌ర్స్‌.

ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ రోల్‌లో ఈ సినిమాతో విక్ర‌మ్ అల‌రించ‌బోతున్నాడు. ఆయ‌న లుక్ మాస్‌ గా ఉంది. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇందులో కాళి పాత్ర‌లో అంద‌రినీ మెప్పించ‌డానికి రెడీ అవుతున్నాడు విక్రమ్.

విక్ర‌మ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధికీతో పాటు ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. ఈమధ్య కాలంలో విక్రమ్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా ఇదే.

First Published:  13 May 2024 9:06 AM GMT
Next Story