Telugu Global
Cinema & Entertainment

నటుడు విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య

హీరో విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని ఆల్వార్‌పేట డీడీకే రోడ్డులో నివాసం ఉంటున్నారు.

నటుడు విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య
X

'బిచ్చగాడు' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో చిరపరితుతుడు అయిన హీరో, డైరెక్టర్, నిర్మాత విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. 12వ తరగతి చదువుతున్న ఆయన కూతురు మీరా ఆంటోనీ ఉరేసుకొని చనిపోయింది. ఇంట్లో ఉరేసుకున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు తంతి టీవీ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు పెట్టింది.

హీరో విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని ఆల్వార్‌పేట డీడీకే రోడ్డులో నివాసం ఉంటున్నారు. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ (16) చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నది. అయితే ఇటీవల చదువుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తున్నది.

ఈ క్రమంలో మీరా ఆంటోనీ సోమవారం తెల్లవారుజామును 3 గంటలకు తన గదిలోనే ఉరేసుకున్నట్లు సమాచారం. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కావేరీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మీరా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మీరా చనిపోయిన సమయంలో తండ్రి విజయ్ ఆంటోనీ ఇంట్లో లేరని తెలుస్తున్నది. ఆయన షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లారని సమాచారం. కాగా, పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story