Telugu Global
Cinema & Entertainment

Thiruveer | మరో సినిమాకు ఓకే చెప్పిన విలక్షణ నటుడు

Actor Thiruveer - విలక్షణ నటుడు తిరువీర్ మరో సినిమా ప్రకటించాడు. ఈసారి ఇంకో కాన్సెప్ట్ ఎంచుకున్నాడు.

Thiruveer | మరో సినిమాకు ఓకే చెప్పిన విలక్షణ నటుడు
X

చ‌క్క‌టి హావ భావాలు, న‌ట‌న‌తో నటుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్.. ప‌రేషాన్‌, జార్జ్ రెడ్డి, ప‌లాస 1978, మ‌సూద వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాల్లో పెర్ఫామెన్స్ ప‌రంగా మెప్పించిన తిరువీర్ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

ప్ర‌స్తుతం మ‌ల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో తిరువీర్ బిజీగా ఉన్నారు. మ‌రిన్ని డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో తిరువీర్ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మూన్ షైన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయి మ‌హేష్ చందు, సాయి శ‌శాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ద్రిష్టి త‌ల్వార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

రెండు వేర్వేరు ప్ర‌పంచాలు క‌ల‌యిక‌గా విభిన్నంగా తయారుచేసిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. డార్క్ కామెడీ జోన‌ర్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ సినిమాతో తిరువీర్ మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో మెప్పించ‌నున్నాడు.

త్వ‌ర‌లోనే షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. లియోన్ జేమ్స్ సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్న ఈ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రాఫర్. తిరువీర్ గత సినిమాల్లానే ఇది కూడా విభిన్నంగా ఉండబోతోంది.

First Published:  26 Nov 2023 1:19 PM GMT
Next Story