Telugu Global
Cinema & Entertainment

ఫ్యాన్స్‌కి షాక్ : బాల సినిమా నుంచి తప్పుకున్న సూర్య

'అచలుడు కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చింది. దాంతో ఈ సినిమా కథ సూర్యకు సరిపోదని అనిపించింది. సూర్యకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం' అని బాల లేఖ ద్వారా వెల్లడించాడు.

ఫ్యాన్స్‌కి షాక్ : బాల సినిమా నుంచి తప్పుకున్న సూర్య
X

ఫ్యాన్స్‌కి షాక్ : బాల సినిమా నుంచి తప్పుకున్న సూర్య

తమిళ అగ్ర హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు బాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అచలుడు సినిమా ఆగిపోయింది. ఈ మేరకు ఆ సినిమా దర్శకుడు బాల ఒక లేఖ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. కోలీవుడ్‌లో సూర్య, బాల మంచి సన్నిహితులుగా పేరుంది. సూర్య తన కెరీర్ ప్రారంభంలో బాల దర్శకత్వంలో చేసిన నందా, శివపుత్రుడు సినిమాలు మంచి విజయం సాధించి సూర్యకు గుర్తింపు తీసుకువచ్చాయి.

సుదీర్ఘ విరామం తర్వాత బాల దర్శకత్వంలో సూర్య అచలుడు సినిమా ప్రకటించాడు. తెలుగు స్టార్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 40 శాతం మేర షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆగిపోయింది. దీనిపై బాల ఒక అధికారికంగా ఒక ప్రకటన చేశాడు.

'అచలుడు కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చింది. దాంతో ఈ సినిమా కథ సూర్యకు సరిపోదని అనిపించింది. పరస్పర అంగీకారంతో సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. సూర్యకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం' అని బాల లేఖ ద్వారా వెల్లడించాడు.

కాగా ఈ సినిమాను సూర్యనే తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. దీంతో నిర్మాతగా కూడా ఆయన వైదొలిగాడు. కాగా సూర్య తప్పుకున్నప్పటికీ ఈ చిత్ర నిర్మాణం మాత్రం కొనసాగుతుందని బాల తెలిపాడు. ఇటీవల బాల సినిమాలకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. గతంలో అజిత్‌తో ఒక సినిమా మొదలుపెట్టి మధ్యలోనే ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశాడు.

ఇక తెలుగులో మంచి విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్‌లో విక్రమ్ కొడుకు ధ్రువ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బాల రీమేక్ చేశాడు. ఆ సినిమా అవుట్ పుట్ సరిగా రాకపోవడంతో విక్రమ్ దానిని స్క్రాప్ చేసి గిరీశయ్య అనే దర్శకుడితో అదే సినిమాను మళ్ళీ తెరకెక్కించాడు. ఇప్పుడు బాల సూర్యతో చేస్తున్న సినిమా కూడా క్యాన్సిల్ కావడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  5 Dec 2022 7:46 AM GMT
Next Story