Telugu Global
Cinema & Entertainment

Actor Siddharth: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సిద్దార్థ్

Actor Siddharth's Takkar movie - టక్కర్ సినిమా చేశాడు సిద్దార్థ్. ఇందులో యాక్షన్ పార్ట్ ఎక్కువ. దీని కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు ఈ హీరో.

Actor Siddharth: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సిద్దార్థ్
X

Actor Siddharth: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సిద్దార్థ్

మహాసముద్రం తర్వాత మరో సినిమా రెడీ చేశాడు సిద్దార్థ్. ఈసారి టక్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరో.. 'టక్కర్' లో సరికొత్తగా కనిపిస్తానని చెబుతున్నాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట సిద్దార్థ్.

"నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు కంప్లీట్ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు కదా అని, దానికి సమాధానమే టక్కర్. ఇప్పటివరకు ఒక లవర్ బాయ్ లా చూశారు. ఈ సినిమాలో నన్ను డిఫరెంట్ గా చూస్తారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది."

ఈ ఆగస్ట్ కి ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు సిద్దార్థ్. ఇన్నేళ్లయినా ఇంకా చేతిలో సినిమాలు ఉండడం తన అదృష్టం అంటున్నాడు. టక్కర్ సినిమాతో తన కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్తుందని చెబుతున్నాడు.

కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన టక్కర్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

First Published:  1 Jun 2023 6:19 AM GMT
Next Story