Telugu Global
Cinema & Entertainment

Actor Prince: ఈసారి సీరియస్ విలనిజం

Actor Prince to be seen as villian in ram-boyapati movie - ప్రిన్స్ విలన్ గా మారాడు. రామ్ కొత్త సినిమా లో ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు.

Actor Prince: ఈసారి సీరియస్ విలనిజం
X

నటుడు ప్రిన్స్ గురించి అందరికీ తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో ఇండస్ట్రీకొచ్చాడు. ఆ తర్వాత బస్ స్టాప్, నేను శైలజ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు ఏకంగా సీరియస్ విలన్ అవతారం ఎత్తాడు.


బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ఇందులో విలన్ పాత్ర కోసం ప్రిన్స్ ను తీసుకున్నారు. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఆ పాత్రలకు ప్రత్యేకమైన మేనరిజమ్స్, స్పెషల్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి.


సో.. ఈ సినిమాతో ప్రిన్స్ కెరీర్ టర్న్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రిన్స్ మెయిన్ విలన్ కాదు, అతడిది నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర మాత్రమే. అది క్లిక్ అయినా చాలు. ప్రిన్స్ కెరీర్ మారిపోతుంది.


నేను శైలజ సినిమాలో ప్రిన్స్-రామ్ కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి ఇలా కలిశారు. కాకపోతే ఈసారి రామ్ హీరో, ప్రిన్స్ విలన్. శ్రీలల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  7 Feb 2023 10:54 AM GMT
Next Story