Telugu Global
Cinema & Entertainment

Jeeva | వైఎస్ జగన్ పాత్రను పోషించడం చాలా కష్టం

Actor Jeeva - యాత్ర-2 మూవీ తన కెరీర్ లోనే స్పెషల్ అంటున్నాడు జీవా. జగన్ పాత్రను పోషించడం చాలా కష్టం అని తెలిపాడు.

Jeeva | వైఎస్ జగన్ పాత్రను పోషించడం చాలా కష్టం
X

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు.

2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జగన్ పాత్ర పోషించిన జీవా మీడియాతో మాట్లాడారు.

"వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది. యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాను. జగన్ గారు ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీదో ఎంతో శ్రద్ద తీసుకున్నాను. ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. మొదటి రోజు షూటింగ్ కు వచ్చిన తర్వాత, డైరెక్టర్ ఎప్పుడైతే షాట్‌కి ఓకే చెప్పారో అప్పుడు నాకు రిలీఫ్ అనిపించింది."

ఈ పాత్రకు జీవాను ఓకే చేయడానికి దర్శకుడు మహి వి రాఘవ్ చాలా టైం తీసుకున్నాడట. తను జగన్మోహన్ రెడ్డిలా కనిపిస్తాననే విషయం ఫస్ట్ షాట్ ఓకే అయిన తర్వాత అర్థమైందంటున్నాడు జీవా. అప్పట్నుంచి ఇక మానిటర్ చూడలేదని, జగన్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని నటించానని తెలిపారు. ఇది సినిమానే అయినప్పటికీ.. చూడు నాన్నా అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యానని తెలిపారు జీవా.




First Published:  7 Feb 2024 1:41 AM GMT
Next Story