Telugu Global
Cinema & Entertainment

చంద్ర‌మోహ‌న్ ల‌క్కీ హ్యాండ్‌.. హీరోయిన్ల‌కే కాదు.. స‌న్నిహితుల‌కు కూడా

అల‌నాటి అందాల తార‌లెంద‌రికో చంద్ర‌మోహ‌నే ఫ‌స్ట్ హీరో. జాతీయ స్థాయిలో వెలిగిన శ్రీ‌దేవి బాల‌న‌టిగా చేసిన `ప‌ద‌హారేళ్ల వ‌య‌సు`తో బాగా జ‌నాల్లో ఫేమ‌స్ అయ్యారు.

చంద్ర‌మోహ‌న్ ల‌క్కీ హ్యాండ్‌.. హీరోయిన్ల‌కే కాదు.. స‌న్నిహితుల‌కు కూడా
X

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు, హీరో నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వ‌ర‌కు వంద‌ల సినిమాల్లో న‌టించిన చంద్ర‌మోహ‌న్ ఈరోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటున్నారు. చంద్ర‌మోహ‌న్‌ది ల‌క్కీ హ్యాండ్ అని, ఆయ‌న‌తో న‌టించాక చాలా మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఎదిగార‌ని గుర్తుచేసుకుంటున్నారు.

శ్రీ‌దేవి, జ‌య‌సుధ‌, విజ‌య‌శాంతి

అల‌నాటి అందాల తార‌లెంద‌రికో చంద్ర‌మోహ‌నే ఫ‌స్ట్ హీరో. జాతీయ స్థాయిలో వెలిగిన శ్రీ‌దేవి బాల‌న‌టిగా చేసిన `ప‌ద‌హారేళ్ల వ‌య‌సు`తో బాగా జ‌నాల్లో ఫేమ‌స్ అయ్యారు. ఇందులో హీరో చంద్ర‌మోహ‌నే. ఆ త‌ర్వాత శ్రీ‌దేవి జాతీయ‌స్థాయికి ఎదిగారు. జ‌య‌ప్ర‌దకు తొలిసారి న‌టిగా బాగా పేరొచ్చిన సినిమా విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `సిరిసిరిమువ్వ‌`. దీనిలో ఆమె చంద్ర‌మోహ‌న్ ప‌క్క‌న న‌టించారు. త‌ర్వాత అగ్ర‌న‌టిగా ఎదిగారు. ఇక జ‌య‌సుధ `పండంటి కాపురం`తో సినిమాల్లోకి వ‌చ్చినా `ప్రాణం ఖ‌రీదు`లో చంద్ర‌మోహ‌న్ ప‌క్క‌న న‌టించాకే బాగా పేరొచ్చింద‌ని చెబుతారు. లేడీసూప‌ర్ స్టార్ విజ‌యశాంతికి కూడా చంద్ర‌మోహ‌న్‌తో `పెళ్లి చూపులు` సినిమాలో న‌టించాక వ‌రుస‌గా అవ‌కాశాలొచ్చాయి. త‌ర్వాత అగ్ర‌న‌టిగా ఎదిగారు.

డ‌బ్బులు తీసుకున్నా క‌లిసొస్తుంద‌ట‌!

చంద్ర‌మోహ‌న్ చేతి నుంచి డబ్బులు తీసుకుంటే క‌లిసొస్తుంద‌ని సినీ జ‌నాలే కాదు.. ఆయ‌న స‌న్నిహితులూ బాగా న‌మ్మేవారట‌. ఈ విష‌యం ఆయ‌న భార్య జ‌లంధ‌ర చెప్పారు. అందుకే చాలామంది జ‌న‌వ‌రి 1న త‌మ ఇంటికి వ‌చ్చి చంద్ర‌మోహ‌న్ చేతుల మీదుగా ఒక రూపాయి అయినా ఇమ్మ‌ని తీసుకునేవార‌ని ఆమె గుర్తుచేసుకున్నారు.

First Published:  11 Nov 2023 8:54 AM GMT
Next Story