Telugu Global
Cinema & Entertainment

నితిన్ ఇచ్చిన 'దమ్కీ' అదిరింది

మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి ఇన్నాళ్లూ సాంగ్స్, టీజర్ మాత్రమే చూశారు. ఇప్పుడు ఫైట్ సీన్ చూసేయండి. ఇది యాక్షన్ దమ్మీ.

నితిన్ ఇచ్చిన దమ్కీ అదిరింది
X

నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ప్రమోషన్స్ తో దుమ్ముదులుపుతోంది ఈ సినిమా. ఇప్పటివరకు విడుదల చేసిన 3 పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ దూకుడు పెంచిన చిత్ర యూనిట్ .. మాచర్ల యాక్షన్ ధమ్కీని రిలీజ్ చేసింది.

మాస్ ఎంటర్‌టైనర్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ చూపించేలా ఈ చిన్న సీన్ ను బాగా కట్ చేశారు. మాచర్ల యాక్షన్ ధమ్కీ లో అదిరిపోయే డైలాగ్, అద్భుతమైన యాక్షన్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించాయి.

'మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు.. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి... నేను సిద్ధం'అని నితిన్ చెప్పిన డైలాగ్ హీరో పాత్రని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా సినిమాపై మరింత క్యూరీయాసిటీని పెంచింది.

యాక్షన్ ధమ్కీ హవా కొనసాగుతుండగానే, ఇదే ఊపులో, ఈ నెల 30న గుంటూరులో జరిగే భారీ పబ్లిక్ ఈవెంట్‌లో 'మాచర్ల నియోజకవర్గం' థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేస్తోంది.

కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేసింది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 12న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.


First Published:  26 July 2022 9:32 AM GMT
Next Story