Telugu Global
Cinema & Entertainment

Acharya Movie: అక్కడ కూడా ఆశాభంగం తప్పలేదు

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా వెండితెరపై ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ బుల్లితెరపై కూడా ఫెయిలైంది.

acharya chiranjeevi ramcharan 2
X

భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది ఆచార్య సినిమా. చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. బయ్యర్లంతా నిలువునా నష్టపోయారు. తర్వాత చిరంజీవి, రామ్ చరణ్, నిర్మాతలు అంతా కలిసి వాళ్లను ఆదుకున్నట్టు వార్తలొచ్చాయి.

ఇప్పుడీ సినిమా మరోసారి ఫ్లాప్ అయింది. తాజాగా జెమినీ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేశారు. దానికి కేవలం 6.3 రేటింగ్ వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమాకు ఈ రేటింగ్ చాలా తక్కువ. కనీసం 10 దాటుతుందని అంతా ఆశించారు. కానీ ఆశాభంగం తప్పలేదు.

అలా చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై కూడా ఫ్లాప్ వెంచర్ గా మిగిలిపోయింది. పండగ సీజన్ చూసుకొని, మొదటిసారి ప్రసారం చేస్తేనే ఇంత తక్కువ రేటింగ్ వచ్చిందంటే, రిపీట్స్ లో ఈ సినిమాకు ఇంకా తక్కువ రేటింగ్ వచ్చే అవకాశం ఉంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది ఆచార్య సినిమా. కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. పూజాహెగ్డే, కాజల్ హీరోయిన్లుగా నటించారు. సరిగ్గా విడుదలకు కొన్ని రోజుల ముందు ఎడిటింగ్ లో కాజల్ పోర్షన్ మొత్తం లేపేశారు.

First Published:  4 Nov 2022 7:30 AM GMT
Next Story