Telugu Global
Cinema & Entertainment

Tiger Nageswar Rao | మాకు మేమే పోటీ

Tiger Nageswar Rao - టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ విషయంలో తమకు ఎలాంటి అనుమానాలు లేవంటున్నాడు నిర్మాత అభిషేక్. ఎంత పోటీ ఉన్నప్పటికీ తట్టుకుంటామని చెబుతున్నాడు.

Tiger Nageswar Rao | మాకు మేమే పోటీ
X

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే నేషనల్ వైడ్ గా బజ్ క్రియేట్ చేస్తుంది టైగర్ నాగేశ్వరరావు సినిమా. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. మరీ ముఖ్యంగా విడుదల తేదీపై స్పందించారు.

ఓవైపు భగవంత్ కేసరి, లియో సినిమాలు ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేశాయి. వాటికంటే 24 గంటలు ఆలస్యంగా టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతోంది. అయినప్పటికీ తమకు టెన్షన్ లేదంటున్నాడు ఈ నిర్మాత. పండక్కి 2-3 పెద్ద సినిమాలు రావడం సహజమేనని... తమ సినిమాపై చాలా నమ్మకం ఉందని చెబుతున్నాడు. అందరికంటే ముందే తాము రిలీజ్ ప్లాన్ చేసుకున్నామని అంటున్నాడు.

బయోపిక్స్ జనరల్ గా నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులపై చేస్తారు. అయితే ఒక దొంగకి బయోపిక్ ఎందుకు చేశామో సినిమా చూసినప్పుడు అర్ధమౌతుంది. ఒక మనిషి దొంగ ఎందుకయ్యాడు? దొంగ అయిన తర్వాత ఏం చేశాడు? వీటన్నిటికి కారణాలు ఉంటాయి. ఇవన్నీ ఈ బయోపిక్ లో ఉంటాయి. మంచి కంటెంట్ తో, ఎవ్వరికీ తెలియని కథలు చెప్పాలనేది తమ సంస్థ లక్ష్యమని.. ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా పవర్ ఫుల్ కంటెంట్ తో వస్తోందని అన్నారు.

రవితేజ ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ అందించాడట. చాలా హార్డ్ వర్క్ చేశాడట. యాక్షన్ సీక్వెన్సులన్నీ ఆయన సొంతంగా చేశాడట. చేతికి గాయమైనప్పటికీ ప్రొడక్షన్ కి ఎంతో సపోర్ట్ చేస్తూ షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాడని నిర్మాత చెబుతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తన ఆల్ టైం ఫేవరేట్ మూవీ గా నిలిచిపోతుందని అంటున్నాడు.

First Published:  19 Oct 2023 2:23 AM GMT
Next Story