Telugu Global
Cinema & Entertainment

ఆకాశం టీజర్.. మరో విభిన్న ప్రయత్నం

అశోన్ సెల్వన్ హీరోగా నటించిన మూవీ ఆకాశం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. అది ఎలా ఉందో చూద్దాం..

ఆకాశం టీజర్.. మరో విభిన్న ప్రయత్నం
X

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అశోక్ సెల్వ‌న్ హీరోగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ఆకాశం'. ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన హీరో అశోక్ సెల్వ‌న్ లుక్ పోస్ట‌ర్స్‌, ముగ్గురు హీరోయిన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. తాజాగా సినిమా టీజ‌ర్‌ను లాంఛ్ చేశారు. డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ చేతుల మీదుగా ఇది విడుద‌లైంది.

హీరోయిన్ వాయిస్‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. మ‌న‌సు ఉల్లాసంగా ఉన్న‌ప్పుడు మ‌ర‌చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి క‌దూ అంటుంది. అశోక్ సెల్వ‌న్ డిఫ‌రెంట్ లుక్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్స్‌.. వారి మ‌ధ్య రిలేష‌న్‌ను అంద‌మైన స‌న్నివేశాల‌తో చూపించారు. లీలావ‌తి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, గోపీసుంద‌ర్ సంగీతం ఈ స‌న్నివేశాల‌కు మ‌రింత అందాన్నిచ్చాయి. బ్యాగ్రౌండ్‌లో ఆకాశం అనే టైటిల్ పాట‌లాగా వినిపిస్తోంది.


ఆకాశం మంచి ప్రేమ క‌థా చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. దీంతో పాటు టీజర్ లోని ఎమోష‌న్స్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుతున్నాయి. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

First Published:  24 Sep 2022 8:28 AM GMT
Next Story