Telugu Global
Cinema & Entertainment

Aakasam Dhaati Vasthaava | దిల్ రాజు బ్యానర్ నుంచి క్యూట్ లవ్ స్టోరీ

Aakasam Dhaati Vasthaava - దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రెండో సినిమా 'ఆకాశం దాటి వస్తావా'. తాజాగా టీజర్ రిలీజైంది.

Aakasam Dhaati Vasthaava | దిల్ రాజు బ్యానర్ నుంచి క్యూట్ లవ్ స్టోరీ
X

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి బలగం తర్వాత రెండో సినిమా రెడీ అయింది. సినిమా పేరు `ఆకాశం దాటి వ‌స్తావా`. కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. శశి కుమార్ ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ రిలీజైంది.

72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతోన్నట్టుగా అనిపించింది. "ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.. ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా?" అంటూ హీరోయిన్ మాట్లాడే మాటలు.. "ఎప్పుడూ ఇంతే అందంగా ఉంటావ్.. నీకు బోర్ కొట్టదా?" అంటూ హీరో చెప్పే సమాధానంతో టీజర్ మొదలవుతుంది. నా కోసం ఆకాశం దాటి వస్తావా అనే హీరోయిన్ డైలాగ్ ఆకట్టుకుంది.

ఈ టీజర్ ద్వారా సరికొత్త ప్రేమ కథను చూపించబోతోన్నట్టుగా దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పారు. ఈ టీజర్‌లో ర్యాంపీ నందిగాం అందించిన విజువల్స్, సింగర్ కార్తీక్ ఇచ్చిన మ్యూజిక్, యశ్-కార్తీక ముర‌ళీధ‌ర‌న్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. మొత్తానికి టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు మేకర్స్.

బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న రెండో చిత్రమిది. ఈసారి కూడా కొత్త టీంతో వస్తున్నారు. హీరో యశ్, హీరోయిన్ కార్తీక ముర‌ళీధ‌ర‌న్‌లు కొత్త వారే. ఈ సినిమాతో సింగర్ కార్తిక్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.

First Published:  4 Aug 2023 4:12 PM GMT
Next Story