Telugu Global
Cinema & Entertainment

Top Gear: ఆది సాయికుమార్ టాప్ గేర్ ట్రయిలర్ ఎలా ఉందంటే?

Top Gear Movie Trailer Review: ఆది సాయికుమార్ నుంచి మరో మూవీ రెడీ అయింది. దీని పేరు టాప్ గేర్. తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

Top Gear: ఆది సాయికుమార్ టాప్ గేర్ ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

'టాప్ గేర్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఆది సాయికుమార్. శశికాంత్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు.

డిసెంబర్ 30న ఈ టాప్ గేర్ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితం రవితేజ చేతుల మీదుగా టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

2 నిమిషాల 9 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉంది. టాప్ గేర్ సినిమాలోని వైవిధ్యాన్ని తెలిపేలా ట్రైలర్ కట్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. ఈ వీడియోలో ఆది సాయి కుమార్ యాక్షన్ సీన్స్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

హీరో హీరోయిన్ మధ్య నడిచే లవ్, రొమాంటిక్ సన్నివేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రేమలో ట్విస్టులు, విలన్స్ అటాక్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ఎవర్రా మీరు.. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అని హీరో ఆది సాయి కుమార్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచింది.

ఈ కథ మొత్తం ట్యాక్సీ డ్రైవర్ అయిన ఆది సాయి కుమార్ చుట్టూ తిరుగుతూ ఆడియన్స్‌కి థ్రిల్ ఫీల్ తెప్పిస్తుందని టాప్ గేర్ ట్రైలర్ స్పష్టం చేసింది.



First Published:  18 Dec 2022 3:39 PM GMT
Next Story