Telugu Global
Cinema & Entertainment

Sabdham | సౌండ్ తో భయపెట్టే సినిమా

Sabdham Movie - ఆది పినిశెట్టి కొత్త సినిమా శబ్దం. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. అందర్నీ భయపెట్టింది.

Sabdham | సౌండ్ తో భయపెట్టే సినిమా
X

ఆది పినిశెట్టి హీరోగా, అరివగన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ శబ్దం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వైశాలి ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. సౌండింగ్ లో ట్రెండ్ సెట్ చేసింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఇద్దరు కలిశారు. శబ్దం అనే సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. క్రైమ్ ను ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో ఆది కనిపిస్తున్నాడు. టైటిల్ కి తగ్గట్టుగా సినిమా మొత్తం సౌండింగ్ చుట్టూనే నడుస్తుందనే విషయాన్ని టీజర్ లో స్పష్టంగా చెప్పారు. టీజర్ లో సౌండ్ ఎఫెక్టులు అదిరిపోయాయి. తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

సిమ్రాన్, లైలా, లక్మీ మీనన్.. ఇలా చాలాపాత్రలున్న ఈ సినిమాలో కథ ఏంటనే విషయాన్ని మాత్రం టీజర్ లో వెల్లడించలేదు. కేవలం ఇదొక క్రైమ్-హారర్ జానర్ మూవీ అనే విషయాన్ని మాత్రమే స్పష్టం చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.

First Published:  13 April 2024 5:35 PM GMT
Next Story